సభలో అడుగుపెట్టిన రెండు రోజులకే కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరో వివాదంలోకి..!

కేంద్ర మంత్రి కి ఫ్లయింగ్‌ కిస్‌..!!

సభలో అడుగుపెట్టిన రెండు రోజులకే కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మణిపూర్ ఘటనపై ఆయన వ్యాఖ్యలు దుమారం రేపగా..లోక్ సభలో మాట్లాడారు. భారత దేశం నుంచి మణిపూర్‌ను ఎవరూ విడదీయలేరని తెలిపారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని స్మృతి ధ్వజమెత్తారు. యుపిఎ హయాంలో ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరిగాయని, ఆర్టికల్ 370 రద్దు వల్లనే రాహుల్ పాదయత్ర చేయగలిగారని, ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని రాహుల్ చెబుతున్నారని, కశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై స్పీకర్‌కు బిజెపి మహిళా ఎంపిలు ఫిర్యాదు చేశారు. రాహుల్ సభ నుంచి బయటకు వెళ్లే సమయంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. సిసి ఫుటేజీ పరిశీలించాలని మహిళ ఎంపిలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు…సభ నుంచి వెళ్లిన రాహుల్ గాంధీ చేసిన పనికి మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘మహిళా సభ్యులందరికీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చి రాహుల్‌ వెళ్లిపోయారని.. ఇది ఓ సభ్యుడి దురుసుగా ప్రవర్తించడమేనని అన్నారు.అలాగే భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. రాహుల్ గాంధీ ఏంటి ఈ ప్రవర్తన అంటూ సభలో ఉన్న మహిళా ఎంపీలు రాహుల్ పై ఫైర్ అయ్యారు. అలాగే.. సీసీటీవీ ఫుటేజీ తీసి ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశామని.. ఆధారాలు సేకరించి రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా ముందు తెలిపారు.