ముగిసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ…

సుమారు 10 గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు...

*ఢిల్లీ*

ముగిసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ.

సుమారు 10 గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు…. రేపు కూడా ఈడీ విచార‌ణ‌కు రాహుల్ గాంధీ..
సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యానికి వెళితే… రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌ధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు…రాహుల్‌ను ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు.

తొలి రోజు సుదీర్ఘంగా సాగిన‌ విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం. ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ లిఖిత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ స‌మాధానాల‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త సాక్ష్యాలుగా ప‌రిగ‌ణించే దిశ‌గా ఈడీ అధికారులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.
అంతకు ముందు. ..నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు ఇచ్చి ఇవాళ విచారణకు హాజరు కావాలని కోరింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్, ప్రియాంక ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీసుకు వెళ్లారు..ఈడీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలియజేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ్ ర్యాలీల పిలుపుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ర్యాలీలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏఐసీసీ ఆఫీసు నుంచి రాహుల్, ప్రియాంక ఇద్దరూ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలతో కలిసి ఈడీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. రాహుల్ పిలుపు మేరకు ఏఐసీసీ ఆఫీసుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా వారు బ్యారికేడ్లు దూకి మరీ ర్యాలీకి వెళ్లారు..