కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండో విడత భారత్ జోడో యాత్రకు తేదీ ఖరారయినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గుజరాత్‌లోని పోరుబందర్(Porbandar) నుంచి మేఘాలయ(Meghalaya) వరకు యాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీ పుట్టిన నేల నుంచి, గాంధీ జయంతి రోజే అంటే అక్టోబర్ 2 నుంచే మొదలు కానున్న రాహుల్ జోడో యాత్ర.. 2024 జనవరిలో రెండో విడత యాత్ర ముగుస్తుంది.
అలాగే రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్( Madhya Pradesh) రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కూడా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి
.