తొలిరోజు 4 కి.మీ నడిచిన రాహుల్ గాంధీ…!!

తెలంగాణ లో తొలి రోజు ముగిసిన భారత్ జోడో యాత్ర…

• _తొలిరోజు 4 కి.మీ నడిచిన రాహుల్ గాంధీ…_

• _భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు…_

• _దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టాం…రాహుల్ గాంధీ…

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి రోజు తెలంగాణ లో విజయవంతంగా ముగిసింది. తొలి రోజు 4 కిలోమీటర్లు రాహుల్ నడిచారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్ పోస్టు వద్ద కు ఉదయం రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుండి నాల్గు కిలోమీటర్ల వరకు రాహుల్ తన పాదయాత్రను కొనసాగించారు. టైరోడ్డులో యాత్ర ముగించి రాహుల్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు…