ఉద్యమంలో రైతులు మరణించినట్లు సమాచారం లేదని..నష్ట పరిహారం ఇవ్వడం మానేస్తారా?..రాహుల్‌గాంధీ..

R9TELUGUNEWS.COM..సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు 700 మంది రైతులు చనిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వెల్లడించారు..

ఉద్యమంలో రైతులు మరణించినట్లు సమాచారం లేదని.. నష్ట పరిహారం ఇవ్వడం మానేస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. నష్ట పరిహారం ఇవ్వడం ఇష్టం లేకే కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ‘‘రైతుల మరణాలపై సమాచారం లేదని కేంద్రం చెబుతోంది. మరణించిన వారి జాబితా పంజాబ్‌ ప్రభుత్వం వద్ద ఉంది. అక్కడి నుంచి జాబితాను తీసుకోవచ్చు. కేంద్రం వైఖరి వల్లే 700 మంది రైతులు చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రానిదే అని రాహుల్‌ అన్నారు…