ఎన్నికల బరిలోకి ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్. అంటూ జోరుగా ప్రచారం..

ఎన్నికల బరిలోకి ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.
అంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజిని పోటీలో నిలపాలని.. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నిలవాలని అధిష్టానం భావిస్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది..

రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇటీవల పలు పుకార్లు వచ్చాయి. అతడు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నాడని.. హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగబోతున్నాడంటూ ప్రచారం సాగింది. ఈ ఊహాగానాల మధ్య, రాహుల్ సిప్లిగంజ్ తన వైఖరిని స్పష్టం చేశాడు. గోషామహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నాడు రాహుల్ సిప్లిగంజ్..

తాను రాజకీయాల్లోకి రావడం లేదని పేర్కొంటూ ఇన్‌స్టా, ట్విట్టర్‌‌లో పోస్టు చేశాడు. “నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అన్ని పార్టీలను, నేతలను గౌరవిస్తాను. నేను ఒక కళాకారుడిని. అందరికీ వినోదం పంచడమే నా పని. నా జీవితమంతా అందుకే అంకితం. ఈ రాజకీయ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నాడు. తాను సంగీతాన్ని కెరియర్‌‌గా ఎంచుకున్నానని, ఇందులో తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పాడు. తాను ఏ పార్టీని ఆశ్రయించలేదని, తనను ఏ పార్టీ కూడా కలవలేదని తెలిపాడు. దయచేసి ఈ పుకార్లను ఆపాలని కోరాడు.