నేటి నుండి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రాక…!!

నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి తెలిపారు. రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నందున వాతావరణం చల్లబడింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకూ పలు చోట్ల వర్షాలు కురిశాయి. గతేడాది జూన్‌ 5న రుతుపవనాలు రాగా ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రవేశించలేదు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.