వరద నీటిలో 300 జింకలు.. వరద వన్యప్రాణులకు శాపంగా మారుతోంది..!!

వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు.
గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ ఆ నీటి ప్రవాహనికి కొట్టుకుపోతున్నాయి.

_తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసలంక (ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో ఉంటుంది)లో సుమారు 300 పైబడి జింకలు, లేళ్లు ఉన్నాయి. వరదనీటి ప్రవాహం అధికమవడంతో పులసలంక చాలా వరకు మునిగిపోయింది..
_దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి._ _పొట్టిలంక సమీపంలో గోదావరి ప్రవాహానికి కొట్టుకు పోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది. దీనిపై అటవీ శాఖ అధికారులు శవపంచనామా నిర్వహిస్తున్నారు…ఇదే పులసల లంకలో సుమారు 1500 గొర్రెలు చిక్కుకుపోగా మూడు రోజుల నుంచి అధికారులు శ్రమించి వాటిని బోట్లు,పంట్లు ద్వారా బయటికి తరలించారు. అయితే జింకలను అలా తీసుకురావడం సాధ్యమైంది కాదు. చెంగుచెంగున పరిగెత్తే వీటిని పట్టుకుని తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్నది.మనషులను చూస్తేనే పారిపోతాయి. 2020 వరదలకు సుమారుగా 100 జంకలు కొట్టుకుపోగా ప్రస్తుత వరదలకు మిగిలిన 300 కూడా కొట్టుకుపోతున్నాయని ఆ పులసలంకలో వ్యవసాయం చేసే రైతులు తెలుపుతున్నారు. అలగే రావులపాలెం బ్యారేజి దిగువన గల లంకల్లో ఉండే జింకలు కూడా ఈ వరద తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి…

*జింకను రక్షించిన కడియపులంక గ్రామస్తులు.. విషాదం… ఆ జింక చనిపోయింది.

గోదావరి వరద ఉదృతి అధికంగా ఉండడంతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసల లంకలో ఉండే వందలాది జింకలు,లేళ్లు గల్లంతవుతున్నాయి, వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. సోమవారం కడియపులంక ఏటిగట్టు ఒడ్డుకు చేరిన ఓ జింకను కుక్కలు దాడి చేస్తుంటే ఆ గ్రామస్తులు పట్టుకుని పంచాయతీకి తీసుకెళ్లారు… విషాదం… ఆ జింక చనిపోయింది… దీంతో మూగదేవాలు చనిపోవడంతో ఆ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేశారు…