మంచు దుప్పటి కప్పుకున్న హైదరాబాద్‌..మళ్లీ మొదలైన వర్షం..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షం మొదలైంది. నిన్న రాత్రి నుంచి వాతావరణంలో మార్పుమొదలైంది.దీంతో రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ మంచుతో కప్పబడింది.
ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మంచు కమ్ముకుంది. నగరంలోని అమీర్‌పేట్‌, పంజాగుట్ట,కూకట్‌ పల్లి, ఎస్‌.ఆర్‌. నగర్, ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్‌. బంజారాహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌,కొండాపూర్‌, మాధాపూర్‌ లలో పొగమంచుతో కూడిన వాతావరణం కలిపించింది. దీంతో నగరవాతావరణం చూస్తుంటే ఊటీని తలపించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది.రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో రాగపోకలకు అంతారయం ఏర్పడింది.కొంతరు ఆమంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నేడు ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ,సికింద్రాబాద్, కూకట్ పల్లి,లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది.కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయ మయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు,కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రెండు రోజుల పాటు రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న సూర్యాపేట,నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈరోజు కూడా రాష్ట్రంలో వర్ష సూచన ఉంది. కరీంనగర్,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ములుగు,కరీంగనగర్, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.