నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఇటీవల కొంతకాలంగా వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురవడంతో కొంత రైతులులో ఆందోళన నెలకొంది.. ప్రస్తుతం ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న ఆవర్తనం రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయంది.