రేపు విద్యా సంస్థలకు సెలవు..

*రేపు విద్యా సంస్థలకు సెలవు*

తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు రేపు కూడా సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా గ‌త మూడు రోజుల నుంచి విస్తారంగా వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గురు, శుక్ర‌వారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు విద్యాశాఖ సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రో 24 గంట‌ల పాటు రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జులై 22(శ‌నివారం)న కూడా అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తూ విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అన్ని జిల్లాల డీఈవోల‌కు ఆదేశాలు జారీ చేశారు.