బంగాళాఖాతంలో అల్పపీడనంతో అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్త కోడూరుతో పాటు పలు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది…50 అడుగుల నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చేసింది. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. దీంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. జగన్ ప్రభుత్వం మరమ్మత్తులు చేపట్టకపోవడంతో తుఫాను షెల్టర్లు అధ్వాన్నంగా మారాయి..

రాష్ట్రంలోని డెల్టా, తీరప్రాంత జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి…రహదారులు జలమయమయ్యాయి. కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పనులకు వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొన్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే ఐదురోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం 16న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. డెల్టా జిల్లాలైన విళుపురం, కడలూరు, నాగపట్టణం, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురైకు మంగళవారం రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, తిరుచ్చి, పెరంబలూర్‌, అరియలూర్‌, పుదుక్కోట్టై తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. చెన్నైలోని అడయారు, మైలాపూర్‌, మందైవెళి, టీనగర్‌, కోడంబాక్కం, నుంగంబాక్కం తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.