జోగులాంబ జిల్లాలో తీవ్ర విషాదం..గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం..

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుడిసె కూలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు..గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ, కూతురు స్నేహ ఉన్నారు. రోజూ మాదిరిగానే కుటుంబసభ్యులంతా రాత్రి గుడిసెలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసిపోయి తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దంపతులతో సహా ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు గాయాలతో బయటపడటంతో స్థానికులు హుటాహుటిన కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూ తమ కళ్లెదుట ఆడుకుంటూ అల్లరి చేసే పిల్లలు చనిపోయారని తెలిసి అందరూ కంటతడి పెడుతున్నారు…..


గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుంటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను అధికారులు గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు…

*జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో అర్థరాత్రి ప్రమాదవశాత్తు గొడ కులీ ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది మృతి చెందడం చాలా బాధాకరం. దుర్ఘటన విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ . మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశం..మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం .. వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తాం..గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, నిర్మాణాలను అధికారులు గుర్తించాలి.. ప్రజలను సురక్షిత స్థావరాలకు అధికారులు తరలించాలి.. జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం తరపున మృతుని కుటుంబ సభ్యులకు అని విధాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు.