మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి హెలికాప్టర్‌ను తెప్పించి..ఇద్దరి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్‌..

భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
కాగా, చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద గోదావరి నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వెంటనే స్పందించారు.వరదలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి హెలికాప్టర్‌ను తెప్పించి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే సుమన్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.