ఊహించని రీతిలో నైరుతి రుతుపవనాలు…దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం వ్యాప్తి..దాదాపు 62ఏళ్ల తర్వాత ఇలా..!!
ఊహించని రీతిలో నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేశ్ కుమార్ చెప్పారు. రుతుపవనాలు దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం వ్యాపించినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రుతుపవనాలు ఆదివారం రోజు ఢిల్లీ, ముంబైకి చేరుకున్నాయన్నారు. దాదాపు 62ఏళ్ల తర్వాత ఇలాజరిగిందన్నారు..జూన్ 11న ముంబైకి, జూన్ 27న ఢిల్లీకి రుతు పవనాలు విస్తరిస్తుంటాయి. అయితే, ఈసారి ఆ రెండు నగరాలకు ఒకే రోజున రుతుపవనాలు చేరుకున్నాయి. ఈ ఏడాది కొత్త విధానంలో రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించినట్లు డాక్టర్ నరేశ్ వెల్లడించారు. ఇక, అస్సాంలో ప్రస్తుతం మేఘాలు వీడాయని, ఫలితంగా అక్కడ వర్షపాతం ఇప్పుడు తక్కువగా నమోదు అవుతుందని వెల్లడించారు. రుద్రప్రయాగ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్లు ఆయన చెప్పారు…