రాగల మూడు, నాలుగు రోజులపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన ..ఐఎండీ. .

రాగల మూడు, నాలుగు రోజులపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది.తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌ తీరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది.

అదేవిధంగా జమ్ముకశ్మీర్‌, చండీగఢ్‌, ఢిల్లీతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 8, 9 తేదీల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాజస్థాన్‌లో 8, 9 తేదీల్లో.. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో 9వ తేదీన వడగండ్ల వానలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది…