రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు ..!!

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దక్షిణ ద్వీప కల్ప ప్రాంతంపై సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, జూన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని తెలిపింది…నైరుతి రుతుపవనాలు చిక్‌మగళూర్‌, బెంగుళూర్ మీదుగా వెళ్తున్నాయ‌ని, రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.రాష్ట్రంలో బుధవారం వరకు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపేరు…