రేపు తెలుగు రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు.!!.

నైరుతి రుతుపవనాలు రేపు మధ్యాహ్నం కల్లా రాష్ట్రాన్ని తాకనున్నాయి.’ రెండ్రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 7వ తేదీనే రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక నిదానంగా కదులుతున్నాయి. ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది..