రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు.

*రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు*

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది

ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున ఆర్థికం అందిస్తున్నది.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున ఆర్థికం అందిస్తున్నది. ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. తాజాగా పదకొండో విడతలో భాగంగా సోమవారం (జూన్‌ 26) నుంచి రైతుల ఖాతాల్లో నుంచి రైతుబంధు ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి 1.5లక్షల మంది పోడురైతులకు సైతం రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.రూ.7720.29కోట్లు జమకానున్నాయని, 1.54కోట్ల ఎకరాలకు అందతున్న రైతుబంధు సాయం అందించనున్నట్లు వివరించారు.