ఈనెల 15 నుంచి రైతు బంధు…!!!

R9TELUGUNEWS.COM: రాష్ట్రంలోని రైతులకు ఈనెల 15 నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేసే అవకాశం ఉంది. యాసంగికి రైతుబంధు నిధులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,500 కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు సొమ్ము జమ కానుంది. మొదటగా ఎకరం లోపు ఉన్న రైతులకు నిధులు జమ కానున్నాయి. అనంతరం రెండు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల భూములు ఉన్న రైతులకు వరుసగా జమ అవుతాయి. అనంతరం మిగితా రైతులకు నిధులు జమ అవుతాయి._వానాకాలం సీజన్‌లో 60.84 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. మొత్తం రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది..