తాసిల్దార్ కార్యాలయం ముందు రైతు కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం..

యాదాద్రి జిల్లా ..

రెవెన్యూ అధికారుల అలసత్వం భరించలేని రైతులు. చివరికి తమ కడుపు నింపే పొలమే తమకు దక్కకుండా పోతుందనే ఆవేదన తో
గుండాల ఎమ్మార్వో ఆఫీస్ ముందు పురుగులమందు తో యాదగిరి అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యాయత్నం , తన భూమిని కబ్జా చేసారని ఎమ్మార్వో కి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన , తన సమస్యని తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరగకపోతే ఇదే పురుగుల మందు తాగి చనిపోతాం అంటూ తాసిల్దార్ కార్యాలయం ముందు క్రిమిసంహారక మందు బాటిల్ తీసుకుని తనకు న్యాయం జరిగేంత వరకు కూడా కార్యాలయం ముందు నుండి కదిలేది లేదంటూ కూర్చున్నారు..