రైతులకు గుడ్ న్యూస్..రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ..

రైతు మెడకు చుట్టుకున్న అప్పుల ఉరిని తొలగించడానికి రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. రుణమాఫీ అంశంపై రైతులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.16,144 కోట్లను పంట రుణాల కోసం కేటాయించారు. రాష్ట్రంలో ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.