రైతు రుణ మాఫీ పై వివరణలు…రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ? ..

*రైతు రుణ మాఫీ పై వివరణలు:*

(1). రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ?

తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఉన్న రైతులకు మాత్రమే. రుణమాఫీ వర్తిస్తుంది..

(02). రుణమాఫీ ఎంత వరకు వస్తుంది ?

కుటుంబానికి రూ॥ లక్ష వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

(3)తేది 11-12-2018 నాటికి బ్యాంకులో రూ॥ 1,60,000/- అప్పు ఉంది.
వారికి రుణమాఫీ వస్తుందా?

తేది 11-12-2018 నాటికి లక్ష పైబడి అప్పు ఉన్న రూ॥ లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

(4). తేది 11-12-2018 నాటికి రూ॥ 30,000/- అప్పు ఉండి, ప్రస్తుతం అప్పు రూ 1,00,000/- ఉన్న వారికి రూ॥ లక్ష్మ రుణమాఫీ వస్తుందా?

నిబంధనల ప్రకారం తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత అయి ఉంటుందో అంతే రుణమాఫీ వస్తుంది. అంటే రూ॥ 70,000/- వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

(5) తేది 11-12-2018 వరకు రూ॥ 1,00,000/- అప్పు ఉండి తేని 31-07-2021 నాడు రూ|| 5000/- వరకు అప్పును పునరుద్ధరన చేసుకున్న వారికి రుణమని వస్తుందా? ఎంత వరకు వస్తుంది.?

జి. రెన్యువల్ కి రుణమాఫీ కి ఎలాంటి సంబంధం లేదు. తేది 11-12-2018 తరువాత అప్పుని రెన్యువల్ చేసుకున్నా, మరియు అప్పు మొత్తం కట్టి. క్లోన్ చేసుకున్న రుణమాఫీ కి అర్యులే. తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత ఉంటుందో (May. రూ. లక్ష వరకు) రుణమాఫీ కూడా అంతే వస్తుంది. కాబట్టి రూ.లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

6) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ॥ 50,000/- అప్పు ఉండి మరియు భర్తకు రూ॥ 70,000/- అప్పు ఉన్నచో రుణమాఫీ ఎంత వరకు వస్తుంది !
కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి భార్యకు
రూ॥ 50,000/- మరియు భర్తకు రూ॥ 50,000/- రుణమాఫీ వస్తుంది..

(7) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ 1,10,000/- భర్తకు 1,60,000/- ఉన్నా రుణమాఫీ ఎంత వస్తుంది ?

భార్య లేదా భర్త, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే రూ॥ లక్ష వరకు రుణమాఫి వస్తుంది.

(8) తేది 11-12-2018. తరువాత తీసుకున్న కొత్త రుణాలకు మాఫీ వస్తుందా?
తేది 11-12-2018 తరువాత తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.

కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు..