బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి….
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..
కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది.
ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను ఆన్ని అన్నారు..