రాజన్న సిరిసిల్లలో భ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సు..
రానున్న విద్యాసంవత్సరం ప్రారంభం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి
రాజన్న సిరిసిల్లలో భ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సు
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం
ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి
తెలంగాణ టెక్స్టైల్స్ రాజధాని సిరిసిల్లలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్) కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది.
ఒకప్పుడు ‘ఉరి’సిల్లగా పేరొందిన సిరిసిల్ల కేసీఆర్ సంకల్పంతో నేడు సంతోషాల ఖిల్లాగా మారిపోయింది. నేతన్నల అభివృద్ధే కాకుండా వారి పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సిరిసిల్లలోనే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకు శనివారం ఉన్నత విద్యామండలిలో బీడీఈఎస్ కోర్సుపై శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ సిరిసిల్లలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సును ప్రవేశ పెట్టాలని సర్కారు నిర్ణయించిందని తెలిపారు. స్థానిక టీఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కళాశాలలో ఈ కోర్సును వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ప్రొ ఫెసర్లు అన్నాజీ శర్మ, అవినాశ్, ఉన్నత విద్యామండలి జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రవీ ణ్, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఓఎస్డీ డాక్టర్ ఏఎస్ఎన్ పావని పాల్గొన్నారు.