రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు..!

రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 23న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు దేవ్ ఉతానీ ఏకాదశి కారణంగా బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఈసీకి లేఖ రాశాయి. నవంబర్ 23న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయని, ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం భారీగా తగ్గుతుందని తెలిపాయి. కాబట్టి మరో తేదీని పోలింగ్ కోసం ప్రకటించాలని కోరాయి. దీనికి సంబంధించి ఈసీకి లేఖ రాశాయి. పార్టీల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ తేదీని నవంబర్ 23కు బదులు నవంబర్ 25కు మార్చింది..