తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్‌ అధికారిక భవనానికి రావడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు….గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, తెలంగాణ సర్కార్‌ మధ్య గ్యాప్‌ పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీజే ప్రమాణస్వీకార నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఇవాళ రాజ్‌భవన్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు…ఇదిలా ఉంటే.. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మ..ఢిల్లీకి బదిలీ అయ్యారు.
గత నాలుగేళ్లలో తెలంగాణ హైకోర్టుకు.. ఐదుగురు సీజేలు బాధ్యతలు చేపట్టినట్లు అయ్యింది.