గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున…

తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని చెప్పారు. కేసీఆర్‌ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఈటల జమున ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామన్నారు…