రాజస్థాన్ సీఎం పదవిపై సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ లో అయోమయం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారైనా.. పోటీచేసేది ఎవరు.. ఎన్నికయ్యేదెవరనే అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు పీసీసీలు రాహుల్ పై ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు శశి థరూర్, అశోక గెహ్లాట్ పేర్లు కూడా వినిపిస్తుండటం.. గందరగోళంగా మారింది. అసలు కాంగ్రెస్ అధిష్ఠానానికైనా క్లారిటీ ఉందా..!!
కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ చేస్తార‌నే వార్త‌ల న‌డుమ త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎం ఎవ‌ర‌నే అంశంపై వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గెహ్లోత్ స్ధానంలో కాంగ్రెస్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ సీఎం ప‌గ్గాలు చేప‌డ‌తార‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కేర‌ళ వ‌చ్చిన స‌చిన్ పైల‌ట్ ఈ అంశంపై పెద‌వివిప్పారు.

రాజస్థాన్ సీఎం పదవిపై సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లోత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న క్రమంలో.. బుధవారం సోనియాతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీనిసైతం గెహ్లోత్‌ కలవనున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ చేస్తార‌నే వార్త‌ల న‌డుమ త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎం ఎవ‌ర‌నే అంశంపై వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గెహ్లోత్ స్ధానంలో కాంగ్రెస్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ సీఎం ప‌గ్గాలు చేప‌డ‌తార‌నే ఊహాగానాలు సాగుతున్నాయి..
బుధవారం 14వ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట సచిన్ పైలట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ ను రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయంపై విలేకరుల ప్రశ్నించగా.. పార్టీ త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా తాను నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు. అశోక్ గెహ్లోత్ సీనియ‌ర్ నేత‌ని, ఆయ‌న ద‌శాబ్ధాలుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాజ‌స్ధాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని పైల‌ట్ స్ప‌ష్టం చేశారు. త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎం ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా కాంగ్రెస్ నాయ‌క‌త్వం త‌మ‌కు ఏ బాధ్య‌త‌ల‌ను నిర్ణ‌యించినా దాన్ని ఆమోదిస్తామ‌ని పైల‌ట్ పేర్కొన్నారు.