భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ…

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. ఆయన విడుదల చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేళ రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యానాధ్ కు ఓటు వేయాలని, లేకుంటే యూపీ నుంచి వెళ్లిపోవాలని రాజాసింగ్ హెచ్చరించారు..అంతేకాకుండా ఓటు వేయని ప్రాంతాలను గుర్తించి అక్కడకు బుల్ డోజర్లు, జేసీబీని పంపిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. దీనిపై ఎన్నికల కమిషన్ రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించేటట్లు ఉందని ఈసీ అభిప్రాయపడింది. ఇరవై నాలుగు గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.