ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పనిలేదు లేదు..రాజస్థాన్‌లో వచ్చేది మేమే: అమిత్‌షా.

R9TELUGUNEWS.COM: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజాగా బదులిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కూల్చబోమని, కానీ 2023లో వచ్చేది మాత్రం తామేనని చెప్పారు. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనని వాళ్లు (కాంగ్రెస్‌) భయపడుతున్నారు. భాజపా ఎప్పుడూ మీ ప్రభుత్వాన్ని కూల్చదు. మా పార్టీ నేరుగా ప్రజాభిప్రాయాన్నే కోరుతుంది. 2023లో వచ్చేది మేమే అని అమిత్‌ షా అన్నారు.‘గరీబీ హఠావో’ అని ఇందిరా గాంధీ నినాదమిచ్చారు గానీ, పేదరికం మాత్రం తొలగలేదని షా ఎద్దేవాచేశారు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే పేదరికం పారదోలడం సాధ్యమైందని అమిత్‌ షా అన్నారు.