మహారాష్ట్రలోని అధికార శివసేన, ఎన్సీపీ,కాంగ్రెస్ కూటములకు షాక్ ఇచ్చిన బీజేపీ..

మహారాష్ట్రలో బీజేపీ హవా....

మహారాష్ట్రలోని అధికార శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కూటములకు షాకిస్తున్న ప్రతిపక్ష బిజెపి.. ప్రైవేట్

మూడు రాజ్యసభ సీట్లు గెలుచుకున్న బీజేపీ…

మహారాష్ట్రలో అధికార శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ఫోటో మీద కు గట్టి షాక్ తగిలి ఆరు సీట్లు అధికార కూటమి… మారో 3 బిజేపి గెలుచుకుంది..

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుని అధికార కూటమికి షాకిచ్చింది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. ఇక్కడ గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. ఇక, మహారాష్ట్రలోని అధికార ఎంవీఏ (మహారాష్ట్ర వికాస్ అఘాడీ) కూటమి బరిలోకి దింపిన అభ్యర్థుల్లో శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, శివసేన రెండూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి…
స్థానాల్లో 8 కైవసం..కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు
రాజస్థాన్‌ బరిలో నిలిచిన సుభాష్‌ చంద్ర ఓటమి
రాజస్థాన్‌లో బిజెపి ఎమ్మెల్యే క్రాస్‌ ఓటింగ్‌..పార్టీ నుంచి సస్పెన్షన్‌
విజేతల్లో నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌,జైరామ్‌ రమేశ్‌, రణ్దీప్‌ సూర్జేవాల
న్యూఢిల్లీ,జూన్‌11 : రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి సత్తాచాటింది. శుక్రవారం నాలుగు రాష్టాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార బిజెపి 8, విపక్ష కాంగ్రెస్‌ 5 సీట్లను దక్కించుకున్నాయి. అగ్రనేతలు నిర్మలా సీతారామన్‌, రణదీప్‌ సుర్జేవాలా, సంజరురౌత్‌ తదితరులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార భాజపా 8, విపక్ష కాంగ్రెస్‌ 5 సీట్లను కైవసం చేసుకున్నాయి. శివసేన, ఎన్‌సీపీ చెరో సీటును దక్కించుకోగా.. హరియాణాలో భాజపా మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార మహావికాస్‌ అఘాడీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గానూ భాజపా మూడు స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా నుంచి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అనిల్‌ బోండే, ధనంజరు మహాదిక రాజ్యసభకు ఎన్నికయ్యారు. శివసేన నుంచి సంజరు రౌత్‌, ఎస్‌సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్‌, కాంగ్రెస్‌ నుంచి.. ప్రతాప్‌ గర్హీ పెద్దల సభకు ఎన్నికయ్యారు. శివసేన మరో అభ్యర్థి సంజరు పవార్‌ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో నాలుగు స్థానాలకుగానూ భాజపా మూడు, కాంగ్రెస్‌ ఒక సీటు దక్కించుకున్నాయి. భాజపా నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నటుడు జగ్గేశ్‌, ఎమ్మెల్సీ లెహర్‌ సింగ్‌ సిరోయా విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ కేంద్రమంత్రి.. జైరాం రమేశ్‌ గెలుపొందారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. రాజస్థాన్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ మూడు స్థానాలను కైవసం చేసుకోగా భాజపాకు ఒకసీటు దక్కింది. కాంగ్రెస్‌ నుంచి రణ్‌దీప్‌ సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక, ప్రవెూద్‌ తివారీ పెద్దలసభకు ఎన్నికకాగా.. భాజపా నుంచి ఘన్‌శ్యామ్‌ తివారీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. భాజపా మద్దతుతో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన జీ విూడియా అధినేత సుభాష్‌ చంద్ర ఓటమిపాలయ్యారు. భాజపా ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో శోభారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని భాజపా రద్దుచేసింది. హరియాణాలోని రెండు స్థానాల్లో భాజపా అభ్యర్థి క్రిష్ణన్‌ లాల్‌ పన్వార్‌, భాజపా మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించారు. ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క్రాస్‌ ఓటింగ్‌ వేయడం, మరో ఎమ్మెల్యే ఓటు చెల్లకపోవటం వల్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజరు మాకెన్‌ ఓటమిపాలయ్యారు. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర, హరియాణాల్లో కౌంటింగ్‌ జరిగింది. .