ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..!

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

మంచి డ్యాన్స్ తో పెద్ద పెద్ద హీరోలతోనే శభాష్ అనిపించుకున్నాడు రాకేష్ మాస్టర్… యూట్యూబ్ ఛానల్ లో కూడా తనదైన షేర్లు కామెడీని కూడా ఇటీవలే చేస్తూ తెలుగు ప్రేక్షకులను నవ్విచారు..
*విశాఖ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే..

అయితే తాజాగా విశాఖ నుంచి వస్తుండగా.. ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..