రామమందిరంలో బంగారు తలుపు…

Ram Mandir Gold Door
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు….గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న తలుపును ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు..రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు యూపీ సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ మందిర ప్రారంభోత్సవం దృష్ట్యా ఆ రోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు. ఆలయం ప్రారంభోత్సవం రోజున యూపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు..
వేడుకల సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పరిశుభ్రత పాటించేలా కుంభ్ మోడల్ ను అమలు చేయాలని ఆదేశించారు. జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి 22 వతేదీన అయోధ్య ఆలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోసం అలంకరించనున్నారు.