రేపటి నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ..

రేపటి నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది.

20 రోజులపాటు బీజేపీతో సహా సంఘపరివార క్షేత్రాలన్ని కార్యక్రమంలో ఉండబోతున్నారు. 20 రోజులపాటు పార్టీ శ్రేణులన్నీ కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి నిధి సేకరణలోనే పాల్గొనాలని బీజేపీ ఆదేశించింది. రేపటి నుంచి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ అనే కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని 9000 గ్రామాల్లో ప్రతి ఇంటిని శ్రీరామ మందిర నిర్మాణంలో భాగం చేస్తామని సంఘ పరివార క్షేత్రాలు పేర్కొన్నాయి. 3 కోట్లకు పైగా హిందువులను ప్రత్యక్షంగా కలుస్తామని అన్నారు. అయోధ్యశ్రీరామమందిరం జాతి స్వాభిమాన మందిరం అని అన్నారు. 492 సంవత్సరాల నిరీక్షణ, 76 ప్రత్యక్ష పోరాటాలు, 4.5 లక్షల మంది రామ భక్తుల బలిదానాలు, 135 సంవత్సరాల న్యాయపోరాటం అనంతరం నేడు మందిర నిర్మాణ కల సాకారమవుతుందని అన్నారు. మందిర నిర్మాణంలో పాల్గొనే అదృష్టం ఈ తరానికి కలిగిన అదృష్టం అని సంఘ పరివార క్షేత్రాలు తెలియజేశాయి. ..