ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ పై క్లారిటీ.. దాంతో పోలిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ చిన్నదే..ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి..

ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అసలుదా, నకిలీదా అనే విషయమై ఇంకా రిపోర్టు రాలేదు...

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అసలుదా, నకిలీదా అనే విషయమై ఇంకా రిపోర్టు రాలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి చెప్పారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో నిజమైందని తేలితే ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసకొంటామన్నారు. ఈ వీడియోకు సంబంధించిన నివేదిక ఇంకా రాలేదన్నారు. నివేదిక వచ్చేవరకు ఆగాలన్నారు. అంతేకాదు గోరంట్ల మాధవ్ లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా ఎవరూ కూడా ఫిర్యాదు చేయని విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు..ఏడేళ్లైనా కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ పై క్లారిటీ రాలేదన్నారు.
గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వీడియో మార్పింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ ప్రకటించారు. అరగంటలో ఈ వీడియో అసలుదో, నకిలీదో తేలుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. అయితే ఏడేళ్లుగా చంద్రబాబు వాయిస్ విషయమై ఎందుకు తేలలేదో చెప్పాలన్నారు.