ప్రముఖ పంచాంగకర్త, జోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర..

R9TELUGUNEWS.COM ప్రముఖ పంచాంగకర్త, జోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జోతిష్యులుగా విశేష సేవలందించారు.ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.