బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ లో హై అలర్ట్..!!

బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ లో అప్రమత్తం అయ్యారు పోలీసులు. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించినట్లు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు..హైదరాబాద్ లోని కీలక ప్రాంతాలతో పాటు జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్, మాల్స్ లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్నారు పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం ప్రాంతంలో ప్రముఖ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం
( మార్చి 1, 2024) బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, ఇద్దరు కస్టమర్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
Rameshwaram Cafe Incident Is A Bomb Blast – Hyd On High Alert.
భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. పేలుడు విషయం తెలుసుకున్న వైట్ ఫీల్డ్ ఏరియా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతమంతా తనిఖీలు చేపట్టారు. రామేశ్వరం కేఫ్ బెంగుళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ లలో ఒకటి.