రణబీర్ కపూర్ పుష్ప పై ఆసక్తికర వ్యాఖ్యలు.

పుష్ప, తగ్గెదె లె.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ డైలాగులకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. అంతర్జాతీయ నటీనటులు, క్రికెటర్లు.. ఇప్పటికీ ఎన్నోసార్లు మన పుష్ప తగ్గెదె లె అన్న డైలాగును ఇమిటేట్ చేశారు. ఆ రేంజ్‌లో ఉంది ప్రస్తుతం పుష్ప క్రేజ్. బాలీవుడ్‌లో సైతం పుష్ప డామినేషన్ చాలాకాలం కొనసాగింది. ఇక తాజాగా మరో బాలీవుడ్ హీరో కూడా పుష్ప మీద ఇష్టాన్ని బయటపెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువయిపోయింది. అది కూడా పుష్పతోనే మొదలయ్యింది. పుష్ప తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యి హిందీ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాయి. కానీ ముఖ్యంగా పుష్స మ్యానరిజం మాత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే రణబీర్ కపూర్ కూడా ఇటీవల పుష్పపై ఆసక్తికర వ్యాఖ్యలు..