చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన..తూలుతూ పిచ్చి చేష్టలు…విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు..!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఘటన..

*కొత్తూరు.. స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో చాక్లెట్లు లభ్యం

విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు..

చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..

ఉపాధ్యాయులు ఆరా తీయడంతో వెలుగులోనికి వచ్చిన విషయం..

గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ధీరేందర్ బిహారా..

పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు..

విద్యార్థులుచాక్లెట్స్ తిని తరగతి గదిలో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయుల ఈ విషయాన్ని గమనించి ఆరా తీయగా గంజాయి కలిసిందని తెలిసింది. వెంటనే దీనిపై పోలీసులకు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు చాక్లెట్లో గంజాయి పెట్టి అమ్ముతున్నారని గుర్తించిన పోలీసులు, నిందితుల్లో ముగ్గురుని అరెస్ట్(3 Persons Arrest in Chocolate Drug Case) చేయగా మరో ఒక్కడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది…..

శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్షాప్లో విద్యార్ధులు చాక్లెట్లు(Drug Chocolates in Rangareddy) తరచూ విక్రయించారు. వాటిని తిన్న విద్యార్థులు కాసేపటికే వింతగా ప్రవర్తించారు. పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాలు లభించే చాక్లెట్లను తిని తరగతి గదిలోకి వచ్చాక మత్తులోకిజారుకుంటున్నారు. ఆ పాఠశాల్లో చదువుతున్న ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కొద్దిరోజులుగా వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. తీరా ఆరా తీయగా చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఓటీ బృందం దీనిపై ఆరా తీసింది.DCP Reaction on Chocolate Drug Case : మంగళవారం చాక్లెట్ అమ్ముతున్న ఇద్దరు దుకాణదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాపు దగ్గర నుంచి చార్మినార్ గోల్డ్ మునక పేరిట 8 కిలోల బరువు ఉన్న 42 చాక్లెట్ ప్యాకెట్లను చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1.30 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అనంతరం చాక్లెట్లలో గంజాయి కలిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల షాపు యజమానులు దుకాణం మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం పూర్తిగా విచారణ చేయగా ఒడిశా నుంచి వచ్చిన నలుగురు కొత్తూరు ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల్లో స్థానికంగా ఉండే పిల్లలకు చాక్లెట్ రూపంలో డ్రగ్స్ అమ్ముతున్నరని గుర్తించారు. దీంతో ఆ నలుగురిలో దీరేంద్ర బెహరా, సోమనాథ్ బెహరా, సూర్యమని అరెస్టు చేశామని మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.
“ప్రధాన నిందితుడు దీరేంద్ర బెహెర రోజు గడిచేందుకు డబ్బుల కోసం ఒడిశా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కొత్తురు ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. నిందితులు కొత్త మార్గంలో డ్రగ్స్ని వినియోగదారుల అందించేలా ప్రయత్నం చేశాడు. ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు. నిందితులు ఒక్కో చాక్లేట్ రూ.30 నుంచి రూ.50 చొప్పున అమ్ముతున్నారు. కొత్తూరు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని అమ్ముతున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాం.