పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్..

Rapido Driver and Customer Viral.
దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్‌ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది..

భాగ్యనగరంలో ఎలప్పుడూ ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసులు దూసుకు పోతుంటాయి. ఈ మధ్య కాలంలో జనాలు ఆర్టీసీ బస్సుల కంటే.. వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపు తున్నారు..ఇలా యాప్‌లో బుక్ చేస్తే చాలు.. క్షణాల్లో ఆ బైక్ మన ఇంటికొస్తుంది.. సరాసరి మన డెస్టినేషన్ పాయింట్‌కి చాలా సులభంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసు కెళ్తుంది. అందుకే నేమో.. ఇటీవల ఈ సంస్థలకు చెందిన బైక్ సర్వీసులు విపరీతంగా పెరిగి పోయాయి.అయితే తాజాగా ఓ బైక్ రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది. కస్టమర్ చేసిన పనికి ఏం చేయాలో తెలి యక.. రోడ్డుపై దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు..
బైక్‌లో పెట్రోల్ అయిపో యినా.. కస్టమర్ దిగక పోవడంతో.. ఏం చేయలేక అలాగే బండిని తోసుకుం టూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.