అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు రష్యాను దూరం…

.అమెరికా, దాని మిత్ర దేశాలు, ఐరోపా సమాజం రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షల్ని అనుసరిస్తున్నాయి.ఫలితంగా అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు రష్యాను దూరం పెడుతుండగా, అన్ని రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తున్నది.రష్యాను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నది. అసలే కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థకు అమెరికా, దాని మిత్ర దేశాలు, ఐరోపా అగ్ర దేశాల ఆంక్షలు మరిన్ని కష్టాల్ని తెచ్చిపెడుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఉక్రెయిన్‌పై పోరు విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెనక్కి తగ్గడం లేదు. దీంతో మున్ముందు పరిస్థితులు మరింత జఠిలమయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార కష్టాలు మొదలయ్యాయి. ఎగుమతులు-దిగుమతులు, తయారీ, ఉత్పాదక రంగాలు అధికంగా ప్రభావితమవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు సజావుగా సాగలేని పరిస్థితులుండగా, పెట్టుబడిదారులూ వెనుకకుపోతున్నారు.

అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు రష్యాను దూరం…

ఆర్థికపరమైన ఆంక్షల నేపథ్యంలో రష్యాలో ఉన్న విదేశీ కార్పొరేట్‌ సంస్థలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. రష్యాపై ఆయా దేశాలు, ప్రపంచ శ్రేణి సంస్థలు విధించిన ఆంక్షలు.. తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యాను వీడిపోతున్నారు. యాపిల్‌, ఫోర్డ్‌, బీపీ వంటి అగ్రశ్రేణి సంస్థలు రష్యాకు దూరంగా వెళ్తున్నాయిప్పుడు. ఇప్పటికే ఆటో ఎగుమతి-దిగుమతులు, బీర్ల ఉత్పత్తి నిలిచిపోయాయి. పోర్టుల్లో సరకు రవాణా కూడా దెబ్బతిన్నది. చమురు సంస్థల ఇంధన సరఫరా పరిస్థితీ రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌తో లావాదేవీలకు గుడ్‌బై చెప్తున్న బీపీ, షెల్‌ కంపెనీలు
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్న టయోట
రష్యాకు వాహన ఎగుమతుల్ని ఆపేసిన మెర్సిడెస్‌ బెంజ్‌, వోక్స్‌వాగన్‌. తయారీకీ బ్రేక్‌
డెలివరీలను నిలిపేసిన వోల్వో. కార్యకలాపాలను ఆపేసిన ఫోర్డ్‌.. ఓ జాయింట్‌ వెంచర్‌ రద్దు
రష్యాకు మోటర్‌సైకిళ్ల ఎగుమతుల్ని నిలిపివేసిన హ్యార్లీ డేవిడ్సన్‌
మాస్కో ప్లాంట్‌లో తయారీని ఆపేసిన రెనాల్ట్‌
రష్యాలో బీర్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించిన బడ్‌వర్‌ కంపెనీ
యుద్ధం నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్‌ దేశాల్లో అమ్మకాలను ఆపేస్తున్నామన్న డెల్‌ టెక్నాలజీస్‌
ఉక్రెయిన్‌లో బ్రూవరీస్‌ను మూసేస్తున్నట్టు తెలిపిన కార్ల్స్‌బర్గ్‌
రష్యా ప్రభుత్వ మీడియా చానళ్లను బహిష్కరించిన గూగుల్‌, టిక్‌టాక్‌లు
యాపిల్‌ సైతం పలు రష్యా యాప్‌ల డౌన్‌లోడ్‌కు బ్రేకులు వేసింది. ఐఫోన్ల అమ్మకాలనూ ఆపేస్తున్నట్టు తెలిపింది.