అణ్వాయుధ ప్రయోగంపై రష్యా కీలక ప్రకటన..

తమ ఉనికి ప్రమాదం అనిపిస్తే ఆసమయంలో కచ్చితంగా అణ్వాయుధాలు వాడకం తప్పదు.. రష్యా ప్రకటన...!!

రష్యా,ఉక్రెయిన్‌పై దాడి విషయంలో వస్తున్న ఫలితాన్ని బట్టి అణ్వాయుధాలు ప్రయోగించబోమని రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.దేశ భద్రత విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నాం. రష్యా ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు, ఆ ముప్పును తొలగించేందుకు మాత్రమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం’’ అని డిమిట్రీ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగించబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలతో స్పష్టత ఇచ్చినట్లైంది…