పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు…

తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు.తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగుతుందని పేర్కొన్నారు.ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పుతిన్‌ తొలిసారి మాస్కో బయట పర్యటించారు.
వోస్‌టోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. మరోవైపు తమ దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్నీ వదులుకునేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నామని, భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉంటే యుద్ధమే వచ్చేది కాదు కదా అన్నారు..

నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు…

రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని అనుమానిస్తున్నారు పుతిన్‌. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు చేపట్టారు. ఉక్రెయిన్‌ పోరు జఠిలం అయ్యే కొద్దీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరింత మొండిగా మారుతున్నారు.