చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో రష్యా అంతరిక్ష నౌక లూనా 25 ఇంజన్ వైఫల్యం ఎదుర్కోవడంతో కుప్పకూలింది. దీంతో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే ముందు చంద్రుడిపై అడుగుపెట్టాలన్న రష్యా కల నెరవేరలేదు. చివరకు చేసేది లేక ఆ నౌకను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేసింది. ఆ తర్వాత భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూడా భారత్ ను అభినందించారు.
Nasa orbiter spots Russias Luna-25 crash site on Moon
అయితే చంద్రుడి దక్షిణ ధృవంపైకి రష్యా ప్రయోగించిన లూనా-25 నౌక కుప్పకూలిన చోటును తాజాగా నాసా గుర్తించింది. ఇది చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది. దీంతో ఆ ప్రయోగం తర్వాత ఈ ప్రాంతాన్ని గుర్తించిన నాసా తాజాగా దాని ఫొటోల్ని విడుదల చేసింది. నాసా విడుదల చేసిన రెండు ఫొటోల్లో లూనా 25 కుప్పకూలిన ప్రాంతంలో అక్కడక్కడా గుంతలు పడినట్లు తెలుస్తోంది.
నాసా యొక్క లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) చంద్రునిపై ఓ బిలం కొత్త చిత్రాన్ని తన కెమెరాలో బంధించింది. ఇది రష్యా యొక్క లూనా 25 మిషన్ వైఫల్యం యొక్క ఫలితం అని భావిస్తున్నారు. లూనా 25 మిషన్ దాని అవరోహణ సమయంలో ఓ సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీని వలన అది చంద్రుని ఉపరితలంపై ప్రభావం చూపింది. LRO బృందం కొత్తగా ఏర్పడిన బిలం సహజంగా సంభవించే దాని కంటే ఈ ప్రభావం యొక్క ఫలితం అని నమ్ముతోంది.