రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం లో సాధార‌ణ పౌరులు మృతి…సామూహిక సమాధి చేసినా ఉక్రెయిన్.

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది.
పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా వెళుతున్నారు.. ఇరు దేశాల మధ్య బాంబుల మోతతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా మాత్రం దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే అనేక దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ర‌ష్యా సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూ… త‌న‌పై ఆంక్ష‌లు విధించిన దేశాల‌పై ర‌ష్యాలో కార్య‌కలాపాలు నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు విధిస్తోంది…ర‌ష్యా, ఉక్రెయిన్ మధ్య పొరులో సాధార‌ణ పౌరులు మృతి చెందుతున్నారు.. అయితె.. రష్యా కావాలనే పౌరుల పై దాడి చేసి చంపుతుంది అంటూ ఉక్రెయిన్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే వంద‌లాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని చెబుతోంది. కైవ్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలో 67 మంది పౌరులను ఖననం చేసిన సామూహిక సమాధి చిత్రాన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీట్వీట్ చేసింది. ఇది ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.