*నేటి రాశిఫలాలు* 17.01.021 *ఆదివారం*

*నేటి రాశిఫలాలు*
17.01.2021 *ఆదివారం*

*మేషం:*

కొత్త పనులకు శ్రీకారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ధనలాభ సూచనలు.

*వృషభం:*

దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

*మిథునం:*

వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

*కర్కాటకం:*

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది.

*సింహం:*

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

*కన్య:*

పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. శుభవర్తమానాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

*తుల:*

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు.

*వృశ్చికం:*

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. శ్రమ మరింత పెరుగుతుంది.

*ధనుస్సు:*

కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

*మకరం:*

కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

*కుంభం:*

కుటుంబంలో సంతోషకరమైన సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

*మీనం:*

వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. ఆర్థిక ఇబ్బందులు..