(24-12-2022) రాశి ఫలితాలు.

(24-12-2022) రాశి ఫలితాలు

మేషం
24-12-2022

దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.
—————————————
వృషభం
24-12-2022

కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
—————————————
మిధునం
24-12-2022

వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.
—————————————
కర్కాటకం
24-12-2022

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.
—————————————
సింహం
24-12-2022

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార , ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.
—————————————
కన్య
24-12-2022

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. ప్రేమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
—————————————
తుల
24-12-2022

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
—————————————
వృశ్చికం
24-12-2022

ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.
—————————————
ధనస్సు
24-12-2022

వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
—————————————
మకరం
24-12-2022

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.
—————————————
కుంభం
24-12-2022

దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి.
—————————————
మీనం
24-12-2022

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
—————————————
?శుభం భూయాత్