రాశి ఫలాలు….

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
28, జనవరి , 2021
బృహస్పతి వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
ఉద్యోగంలో అనుకూలత ఉంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటి వారి సహకారం ఉంటుంది. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

🐂 వృషభం
చేపట్టే పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మిధునం
చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

🦀 కర్కాటకం
దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.

🦁 సింహం
మెరుగైన ఫలితాలున్నాయి. సుఖసంతోషాలతో గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. దైవబలం అనుకూలిస్తోంది. శివ ఆరాధన మేలు చేస్తుంది.

💃 కన్య
ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.

⚖ తుల
సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

🦂 వృశ్చికం
చేపట్టే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో అతిచనువు వద్దు. నవమంలో చంద్రుడు అనుకూలించట్లేదు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి

🏹 ధనుస్సు
కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి .

🐊 మకరం
వృత్తి, వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఆవేశాలకు పోకూడదు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

🏺 కుంభం
కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను

🦈 మీనం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.