రాశి ఫలాలు..

08, ఫిబ్రవరి , 2021
రాశి ఫలాలు

? మేషం
మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
???????

? వృషభం
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దైవారాధన ఉత్తమం.
???????

? మిధునం
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభం జరుగుతుంది. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం
???????

? కర్కాటకం
పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
???????

? సింహం
మీరు పని చేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.
???????

? కన్య
తలపెట్టిన కార్యాల్లో నిబద్ధత అవసరం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి.
???????

⚖ తుల
ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

? వృశ్చికం
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే శుభప్రదం.
???????

? ధనుస్సు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే శుభదాయకం.
???????

? మకరం
లక్ష్య సాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమం
???????

? కుంభం
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
???????

? మీనం
తోటివారి ఆదరాభిమానాలు ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేస్తే మరింత శుభం కలుగుతుంది.
???????